Share News

ప్రాణం తీసిన ఈత సరదా

ABN , Publish Date - May 20 , 2025 | 12:19 AM

పులిగుమ్మి గ్రామంలో సోమవారం సాయంత్రం దారుణం జరిగిపోయింది. వివాహ శుభకార్యానికి వచ్చిన ఇద్దరు యువకులు గెడ్డలోకి స్నానానికి దిగి ఈతరాక మునిగిపోయారు.

ప్రాణం తీసిన ఈత సరదా
మృతిచెందిన విద్యార్థులు

పార్వతీపురం రూరల్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): పులిగుమ్మి గ్రామంలో సోమవారం సాయంత్రం దారుణం జరిగిపోయింది. వివాహ శుభకార్యానికి వచ్చిన ఇద్దరు యువకులు గెడ్డలోకి స్నానానికి దిగి ఈతరాక మునిగిపోయారు. వీరిది కృష్ణా జిల్లా నూజివీడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పులిగుమ్మి గ్రామానికి చెందిన మడక గుంపుస్వామి కుమారుడు శేఖరానికి నూజివీడుకు చెందిన అమ్మాయితో బుధవారం వివాహం జరుగనుంది. పెళ్లి కుమార్తె తమ్ముడు, అతన్ని స్నేహితులు నలుగురు పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు సోమ వారమే గ్రామానికి వచ్చారు. వారంతా కలిసి సాయంత్రం పులిగుమ్మి సమీపంలో ఉన్న గెడ్డలోకి స్నానానికి దిగారు. స్నానం చేస్తుండగా కొద్దిసేపటికి బొత్స ఈశ్వర్‌కుమార్‌(16), నగిరెడ్డి రాము (16)లు ఉన్నట్టుండి మునిగిపోయారు. ఊబిలోకి దిగబడిపోయారు. ఇది చూసిన మిగతా వారు వెంటనే చుట్టుపక్కల గ్రామస్థులను పిలిచా రు. వారొచ్చి కాపాడేందుకు ప్రయత్నించి నప్పటికీ అప్పటికే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది.

Updated Date - May 20 , 2025 | 12:19 AM