Share News

గ్రంథాలయాలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:40 PM

విద్యార్థి దశ నుంచి గ్రంథాలయాలను వినియోగించుకుని విజ్ఞానం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నా రు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్య క్రమం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం నిర్వహించారు.

గ్రంథాలయాలను వినియోగించుకోవాలి
విజేతలతో ఎమ్మెల్యే గొండు శంకర్‌

ఎమ్మెల్యే గొండు శంకర్‌

శాఖా గ్రంథాలయాల్లో ముగిసిన వారోత్సవాలు

అరసవల్లి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచి గ్రంథాలయాలను వినియోగించుకుని విజ్ఞానం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నా రు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్య క్రమం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అనేక మంది విద్యార్థులు, యువత సోషల్‌ మీడియా మత్తులో పడి విలువైన కాలాన్ని వృథా చేసుకోవడం బాధాకరమ న్నా రు. అదే సమయాన్ని గ్రంథాలయంలో గడపడం ద్వారా కొత్త కొత్త విషయాలు, విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకా లు ఉన్నాయని, ఉద్యోగార్థులు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహు మతులను అందించారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్‌, ఎ.కనక రాజు, ఫణీంద్ర శర్మ, గ్రంథాలయ కార్యదర్శి శంకరరావు, లైబ్రేరియన్‌ భాస్కరరాజు, ప్రత్యూష, వర లక్ష్మి, కల్యాణి, రామ్మోహన్‌, గణేష్‌ తదిత రులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. గత వారం రోజులుగా విద్యా ర్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహు మతులను అందించారు.

గుజరాతీపేట. నవంబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్విని యోగం చేసుకుని మంచిస్థాయిలో ఉండాలని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్శిటీ గ్రంథాలయ శాస్త్ర విభాగాధిపతి డా. దువ్వు చక్రపాణి అన్నారు. నగరంలోని కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ప్రిన్సి పాల్‌ కె.శివశంకర్‌ మాట్లాడుతూ నేటి యువత సోషల్‌ మీడియాపై చూపుతున్న శ్రద్ధ పుస్తక పఠనం చూపక పోవడం బాధాకరమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సి పాల్‌ వేణు, లైబ్రేరియన్‌ కమలాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:40 PM