మార్పునకు నాంది పలకాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:32 PM
వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పాలన ద్వారా మార్పునకు నాంది పలకాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
- ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
- ఏఎంసీ పాలకవర్గ ప్రమాణం
పాతపట్నం ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పాలన ద్వారా మార్పునకు నాంది పలకాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక ఏఎంసీ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రం పాతపట్నం మండలానికి కాదని తొలిసారిగా మెళియాపుట్టి మండలానికి ఏఎంసీ అధ్యక్ష పదవినిచ్చి మార్పుకు శ్రీకారం చుట్టామన్నారు. పాలనారంగంలో ప్రజాదరణ సాధించి ప్రభుత్వానికి మంచిపేరును తీసుకురావాలని తెలిపారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌గా చిన్నింటి గౌరమ్మ, వైస్‌చైర్మన్‌గా మడ్డు రామారావు, సభ్యులుగా సీమ మీనాక్షీదేవి, బంటుపల్లి జయలక్ష్మి, జామాన రాము, పొట్నూరు లక్ష్మి, సవర రమేష్, గండుబారికి గణపతి, నందిగాం కృష్ణవేణి, సయ్యద్ జూర్, గోకవలస చంద్రశేఖరరావు, రాజాన రమణి. పడాల శ్రీను, బోను సరస్వతి, చింతల ప్రశాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఎరువుల కొరత లేకుండా చూడండి
నియోజకవర్గంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఏడీ జగన్మోహనరావు, ఐదుమండలాల ఏవోలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎస్.ఢిల్లీశ్వరరావు, కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఎరువుల కొరత సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.