సంస్థాగతంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:32 AM
కాంగ్రెస్‌ను సంస్థాగత నిర్మా ణం ద్వారా బలో పేతం చేద్దామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురాజ్ సింగ్ ఠాగూర్ అన్నారు.
పార్టీ జాతీయ కార్యదర్శి సురాజ్‌సింగ్ ఠాగూర్
టెక్కలి, నవం బరు 27(ఆంధ్రజ్యో తి): కాంగ్రెస్‌ను సంస్థాగత నిర్మా ణం ద్వారా బలో పేతం చేద్దామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురాజ్ సింగ్ ఠాగూర్ అన్నారు. గురవా రం టెక్కలిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రా ల్లో సమావేశాలు ఏర్పాటుచేసి కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టబడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్య క్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి, నాయకులు వెంకట శివప్రసాద్, పేడాడ పరమేశ్వరరావు, కోత మధు, అన్నాజీరావు తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం: కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేలా నిర్మా ణాత్మక పనులు చేపట్టాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, న్యూఢిల్లీ సూరజ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. స్థానిక ఓ హోటల్‌లో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొప్పురోతు వెంకటరావు ఆధ్వర్యంలో గురువారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, జిల్లా నాయకులు పేడాడ పరమేశ్వరరావు, బొచ్చు విజయలక్ష్మి పలువురు నాయకులు ప్రజానీకం పాల్గొన్నారు.