Share News

చేసిన అభివృద్ధి ప్రజలకు చూపిద్దాం

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:11 AM

పలాస నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిద్దామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నిక ల్లో శతశాతం టీడీపీ అభ్యర్థులు గెలుపొందేం దుకు అంతా కలసి శ్రమిద్ధామని ఎమ్మెల్యే గౌ తు శిరీష పిలుపునిచ్చారు.

చేసిన అభివృద్ధి ప్రజలకు చూపిద్దాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

  • ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిద్దామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నిక ల్లో శతశాతం టీడీపీ అభ్యర్థులు గెలుపొందేం దుకు అంతా కలసి శ్రమిద్ధామని ఎమ్మెల్యే గౌ తు శిరీష పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మండల, బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌ కార్యవర్గంతో ప్రమాణస్వీకారం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న ప్రత్యేక వేదిక మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ గా.. పెద్ద ఎత్తున పార్టీ నాయకుల, కార్యకర్తలు హాజర య్యారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష మాట్లా డుతూ.. గత వైసీపీ పాలనలో తనతో పాటు పార్టీ కార్యక ర్తలు సైతం ఇబ్బంది పడ్డారని, అనేక మంది వారిపై చర్య లు తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారని, అభివృద్ధి తప్పా అరాచ కం వద్దని వారికి తెలియజేశామన్నారు. అలాగని తమ సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలో అంతా కలుపుకొని పనిచేయాలని, బాధ్యతగా పని చేసి ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు. 2029 ఎన్నికల్లో గెలుపొందాలంటే ఇప్పటి నుంచి సంస్థాగతంగా కష్టించి పనిచేయాలని కోరారు. కా ర్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావు యాదవ్‌, చౌదిరి నారా యణమూర్తి(బాబ్జీ), గొరకల వసంతరావు, దాసరి తాతా రావు, ఎం.నరేంద్ర, దువ్వాడ శ్రీకాంత్‌, గురిటి సూర్యనా రాయణ, సూరాడ మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:11 AM