టీ తాగుదాం.. రండి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:18 AM
వంశ ధార కట్టడాల విభాగం కార్యాలయంలో ఉద్యోగులు టీ తాగుదాం రండి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
సమస్యల పరిష్కారం కోరుతూ వినూత్నంగా ఉద్యోగుల నిరసన
హిరమండలం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వంశ ధార కట్టడాల విభాగం కార్యాలయంలో ఉద్యోగులు టీ తాగుదాం రండి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆ సంఘ రాష్ట్ర నాయక ల పిలుపు మేరకు ఈ కార్యక్రమా న్ని చేపట్టారు. కార్య క్రమంలో సంఘ నాయకులు మీసాల వర ప్రసాదరావు, గుగ్గిలి కల్యాణ్, పి.రవికుమార్, వసంతరావు పాల్గొన్నారు.
నరసన్నపేటలో..
నరసన్నపేట, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం టీ తాగుదాం రండి కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర సంఘ ప్రతినిధుల పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, ఆర్జిత సెలవులు రూపంలో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖలో వివిధ భాగాల్లో పనిచేస్తున్న అటెండర్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు పాల్గొన్నారు.