arasavalli : ఇబ్బందులుంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:56 PM
Public assurance Problem solving ఆరోగ్య ప్రదాత.. అరసవల్లిలోని ఆదిత్యుడి దర్శనానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు కిటకిటలాడాయి. ఈవో కేఎన్‌వీడీ ప్రసాద్.. నేరుగా భక్తులను కలిసి.. ఆలయ నిర్వహణలో ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పాలని, వాటిని సరిదిద్దుకుంటామని తెలిపారు.
అరసవల్లి ఈవో కేఎన్‌వీడీ ప్రసాద్
అరసవల్లి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాత.. అరసవల్లిలోని ఆదిత్యుడి దర్శనానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు కిటకిటలాడాయి. ఈవో కేఎన్‌వీడీ ప్రసాద్.. నేరుగా భక్తులను కలిసి.. ఆలయ నిర్వహణలో ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పాలని, వాటిని సరిదిద్దుకుంటామని తెలిపారు. స్వామి దర్శన సమయంలో ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు.. తదితర అంశాలపై ఆరా తీశారు. అలాగే ప్రసాదం కౌంటర్ల వద్ద ప్రసాదాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సలహాలు, సూచనలు ఎంతో విలువైనవి అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఒక్కరోజునే స్వామికి రూ.7,40,282 ఆదాయం లభించింది. టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.4,33,000, విరాళాల రూపంలో రూ.93,922, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.2,13,360 లభించిందని ఈవో తెలిపారు. వచ్చే ఆదివారం పసిబిడ్డలకు వేడిపాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ బాల భాస్కర సాయి తదితరులు పాల్గొన్నారు.