ఉపాధి కోసం బయలుదేరి..
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:40 PM
రాపాక కూడలి సమీపంలోని గ్యాస్ గోదాం ఎదురుగా శనివా రం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడుకు చెందిన కలగ తారకేష్ (19)అనే యువకుడు మృతి చెందాడు.
-రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పొందూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాపాక కూడలి సమీపంలోని గ్యాస్ గోదాం ఎదురుగా శనివా రం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడుకు చెందిన కలగ తారకేష్ (19)అనే యువకుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివ రాలివీ... తారకేష్ కృష్ణాపురంలో తాపీ పని చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెం దాడు. తారకేష్ సుమారు ఐదేళ్లుగా కొంచాడ గ్రామంలో గల తమ పెద్దమ్మ దగ్గర ఉంటూ తాపీ పని చేసుకుంటున్నాడు. ఎప్పటిలాగే తారకేష్ కృష్ణాపురంలో తాపీ పని కోసం బయలుదేరి వెళ్లగా.. లారీ రూపంలో మృత్యువు కబళించింది. లారీ ముందు భాగంలోని చక్రాల కింద ద్విచక్ర వాహ నం ఉండిపోగా... వెనుక చక్రాల కింద మృతుడి తల నలిగిపోయింది. ప్రమాదం విషయం తెలియటంతో కొంచాడలో ఉన్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని రోదించారు. మృతుడి పెద్దమ్మ కుమారుడు ఇద్దుబోయిన రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.