‘నంబాళ్ల’ కుటుంబానికి నేతల పరామర్శ
ABN , Publish Date - May 31 , 2025 | 11:24 PM
మావోయిస్ట్ చీఫ్ నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవ రాజు మే 21న ఛత్తీస్‌ఘడ్ సమీపంలోని నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నేపథ్యంలో శనివారం స్వగ్రా మం జీయన్నపేటలో ఆయన కుటుంబాన్ని ఆమ దాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, వైసీ పీ నాయకులు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతా రాం పరామర్శించారు.
టెక్కలి, మే 31(ఆంధ్రజ్యోతి): మావోయిస్ట్ చీఫ్ నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవ రాజు మే 21న ఛత్తీస్‌ఘడ్ సమీపంలోని నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నేపథ్యంలో శనివారం స్వగ్రా మం జీయన్నపేటలో ఆయన కుటుంబాన్ని ఆమ దాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, వైసీ పీ నాయకులు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతా రాం పరామర్శించారు. అలాగే టెక్కలి నియో జకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పేడాడ తిలక్, జడ్పీ టీసీ దువ్వాడ వాణి పరామర్శించారు. కేశవ రావు తల్లి భారతమ్మను, సోదరులు నంభాళ్ల ఢిల్లేశ్వరరావు, రాం ప్రసాద్‌లను ఓదార్చారు. తమకు చివరి చూపుగా మృతదేహం ఇవ్వలే దని, చితాభస్మం కూడా అందిం చలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేశవరావు కర్మకాండలు ఆదివారం నిర్వహిం చనున్నట్లు ఢిల్లీశ్వరరావు తెలిపారు.