హైకోర్టు సర్క్యూలర్‌పై న్యాయవాదుల నిరసన
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:37 PM
: హైకోర్టు జారీచేసిన సర్క్యూలర్ ప్రకారం కోర్టుల్లో సంతాపాలను ఉదయం ప్రారంభసమయంలో కాకుండా సాయంత్రం పాటించాలని ఆదేశించిన నిర్ణయానికి వ్యతిరేకకంగా బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.
ఆమదాలవలస, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు జారీచేసిన సర్క్యూలర్ ప్రకారం కోర్టుల్లో సంతాపాలను ఉదయం ప్రారంభసమయంలో కాకుండా సాయంత్రం పాటించాలని ఆదేశించిన నిర్ణయానికి వ్యతిరేకకంగా బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.వెంటనే సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు. బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపు సత్యనారాయణ, సెక్రటరీ బగాది గోవిందరాజు, న్యాయవాదులు అల్లాడ విజయ్‌కుమార్, సాధు ధనుంజయ రావు, పైడి వరహా నరసింహులు, తమ్మినేని అన్నం నాయుడు, సీతారాం, మోహన్‌రావు, రాజేశ్వరరావు, హనుమంతు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.