Share News

న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలి

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:44 PM

తక్షణమే రక్షణ చట్టాన్ని చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌, ఆంధ్రప్రదేశ్‌ బీసీ న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు.

న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలి
శ్రీకాకుళం లీగల్‌: నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

శ్రీకాకుళం లీగల్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): తక్షణమే రక్షణ చట్టాన్ని చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌, ఆంధ్రప్రదేశ్‌ బీసీ న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చౌదరి లక్ష్మణరావు, ఐలూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కూన అన్నంనాయుడు, జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఎన్ని సూర్యారావు, గేదెల ఇందిరా ప్రసాద్‌, ఇప్పిలి సీత రాజు, సూర వేణుగోపాల్‌, అన్నెపు సత్యనారాయణ పాల్గొన్నారు.

ఫఇచ్ఛాపురం,జూలై 25(ఆంధ్రజ్యోతి): న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఇచ్ఛాపురం మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయవాదులు డిమాండ్‌చేశారు ఈ మేరకు శుక్రవారం కోర్టు ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇండియన్‌ అసో సియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ పిలుపు మేరకు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగరాజు పాత్రో ఆధ్వర్యంలో బార్‌అసోసియేషన్‌ సహకారంతో నిరసన చేపట్టారు కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.సోమశేఖర్‌రెడ్డి, కార్యదర్శి జి.కామేష్‌, ఎం.రాంబాబు, బైరాగిరెడ్డి, సీతయ్య, వేణు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:44 PM