రీ-సర్వేతో భూ సమస్యల పరిష్కారం: తహసీల్దార్
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:07 AM
రీ-సర్వేతో రైతుల భూసమస్యలు పరి ష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ ఎం.శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం మండలంలోని పున్నాం పంచాయతీ పరిధిలోగల ఉల్లివలసలో ఏపీ రీ-సర్వే ప్రాజెక్ట్‌లో భాగంగా రీ-సర్వే గ్రామసభ-అవగాహన ర్యాలీ కార్యక్ర మం నిర్వహించారు

జి.సిగడాం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రీ-సర్వేతో రైతుల భూసమస్యలు పరి ష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ ఎం.శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం మండలంలోని పున్నాం పంచాయతీ పరిధిలోగల ఉల్లివలసలో ఏపీ రీ-సర్వే ప్రాజెక్ట్‌లో భాగంగా రీ-సర్వే గ్రామసభ-అవగాహన ర్యాలీ కార్యక్ర మం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు క్రయ విక్రయాలు జరిపిన వెంటనే రెవెన్యూ భూరికార్డుల్లో తమ భూ హక్కులను నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కుమరాపు రవి కుమార్, సర్పంచ్ సుంకరి అప్పన్న, ఆర్‌ఐ ఆబోతుల రాద, రీసర్వే డీటీ కొత్తపల్లి గాయిత్రి పాల్గొన్నారు.
ఫకవిటి,ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి):గ్రామాల్లో భూసమస్యలు పరిష్కారానికే రీసర్వే నిర్వహిస్తున్నామని తహసీల్దార్ మురళీమోహన్‌రావు తెలిపారు. మంగళవారం మండలంలోని డి.గొనపపుట్టుగలో రెవెన్యూ సదస్సు నిర్వహిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతులకు భూసమస్యలు ఉంటే వాటిని సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో జరిగిన సర్వేలో తప్పులు జరిగిఉంటే మళ్లీ జరుగుతున్న రీసర్వేలో సరిచేసుకోవాలని సూచించారు. సదస్సులో సర్పంచ్ బి.కిరణ్‌కుమారి, ఆర్‌ఐ రమణమూర్తి, సర్వేయర్ మల్లికార్జునపాణిగ్రాహి పాల్గొన్నారు.