Share News

ఎయిర్‌పోర్టుకు భూ సేకరణ నిలిపివేయాలి

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:59 PM

మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అధికారులు చేపడుతున్న భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎయిర్‌పోర్టుకు భూ సేకరణ నిలిపివేయాలి
బిడిమి గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్ష నాయకులు

హరిపురం, జూలై 12(ఆంధ్రజ్యోతి): మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అధికారులు చేపడుతున్న భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని వామపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమక్రసీ నాయకులు వంకల మాధవరావు, కోనారి మోహనరావు తదితరులు రాంపురం, బిడిమి గ్రామాల్లో శనివారం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు పేరుతో ఉద్దానంలో విధ్వంసం చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా భూముల కొలతలకు అఽధికారులు రావడం ఏంటని ప్రశ్నించారు. విశాఖ, ఢిల్లీ వంటి పట్టణాల్లో వందల ఎకరాల్లో ఎయిర్‌పోర్టులు ఉంటే ఇక్కడ వేలాది ఎకరాలు సేకరకణ ఎందుకని, దీనిపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొమర వాసు, అప్పారావు, ప్రతినిధులు పి.కుసుమ, రమేష్‌, తెప్పల అజయ్‌, కొర్ల హేమరావుచౌదరి, నీలకంఠం, పత్రి దాసేసు, వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:59 PM