Share News

సౌకర్యాలు లేక..శిథిలావస్థకు చేరి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:00 AM

పాతపట్నం బస్టాప్‌ లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు అగచాట్లకు గురవు తున్నారు. ఒడిశా సరిహద్దుకావడంతో ఇరురాష్ట్రాల ప్రయాణికులతో ఇక్కడ రద్దీగా ఉంటోంది. దీనికితోడు రెండు దశాబ్దాల కిందట నిర్మిం చిన భవనం కావడంతో కనీస మరమ్మతుల లేకపోవడంతో శిథిలా వస్థకు చేరుకుంది.

సౌకర్యాలు లేక..శిథిలావస్థకు చేరి
అధ్వానంగా ఉన్న పాతపట్నం ఆర్టీసీ బస్టా

పాతపట్నం రూరల్‌,అక్టోబరు 6( ఆంధ్రజ్యోతి): పాతపట్నం బస్టాప్‌ లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు అగచాట్లకు గురవు తున్నారు. ఒడిశా సరిహద్దుకావడంతో ఇరురాష్ట్రాల ప్రయాణికులతో ఇక్కడ రద్దీగా ఉంటోంది. దీనికితోడు రెండు దశాబ్దాల కిందట నిర్మిం చిన భవనం కావడంతో కనీస మరమ్మతుల లేకపోవడంతో శిథిలా వస్థకు చేరుకుంది. ఇక్కడకు ప్రతిరోజూ పలాస, శ్రీకాకుళం, టెక్కలి ఆర్టీసీ డిపోలకు సంబందించిన 50 నుంచి 70 వరకు బస్సులు వస్తుం టాయి. ఇక్కడ నుంచి నిత్యం ఎక్కువగా ఒడిశాకు చెందిన వ్యాపారులు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, టెక్కలి, పలాస తదితర ప్రాంతా లకు రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాప్‌లో ప్రయాణికులు వేచి ఉండ డానికి సరైన సౌకర్యాలులేవు. దీంతో పంచాయతీకార్యాల యం వద్ద గల పాతబస్టాప్‌ నుంచి ప్రైవేటుబస్సులను ఎక్కి గమ్యస్థానా లకు చేరుకుంటున్నారు.ఈనేపథ్యంలో ఆర్టీసీకిరావలసిన ఆదాయానికి గండిపడుతోంది. ప్రధా నంగా తాగునీటి సౌకర్యం లేకపోవడంతో బయటదుకా ణాల్లో వాటర్‌ బాటిళ్లను కొనుగోలు చేయాల్సివస్తోందని పలువురు వాపోతున్నారు.విద్యుత్‌దీపాలు లేకపోవడంతో చీకటిప డిన తర్వాత అమావాస్య తలపిస్తోంది. దీంతో ఇక్కడకు ప్రయాణికులు రావడానికి, నైట్‌సర్వీస్‌ సిబ్బంది ఉండేందుకు భయాం దోళన చెందుతున్నారు. బస్టాప్‌ప్రాంగణం లోతట్టు ప్రాంతంలో ఉండ డంతో ఏపాటి వర్షం కురిసినా నీరుచేరుతోంది. తక్షణమే ఆర్టీసీ అధికా రులు స్పందించి ఇక్కడి బస్టాప్‌లో సమస్యలు పరిష్కరించి సౌకర్యాలు కల్పించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.

ప్‌

Updated Date - Oct 07 , 2025 | 12:00 AM