నిర్వహణ లేక.. మురుగు నీరు చేరి
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:49 PM
టెక్కలిలోని జిల్లాపరిషత్ రోడ్డులో సంతోషి మాత ఆలయం సమీపంలో రోడ్డుపైకి మురుగునీరు చేరడంతో వాహన చోదకులు అవస్థలుపడుతున్నారు. కాలువలు సక్రమంగా నిర్వహించకపోవడంతో చెత్త, మురుగు పేరుకుపోతోంది. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపైకి కాలువలోని మురుగునీరు చేరుతుండడంతో వాహనచోదకులు అవస్థలు గురవుతున్నారు.
టెక్కలి, జూలై 17(ఆంఽధ్రజ్యోతి): టెక్కలిలోని జిల్లాపరిషత్ రోడ్డులో సంతోషి మాత ఆలయం సమీపంలో రోడ్డుపైకి మురుగునీరు చేరడంతో వాహన చోదకులు అవస్థలుపడుతున్నారు. కాలువలు సక్రమంగా నిర్వహించకపోవడంతో చెత్త, మురుగు పేరుకుపోతోంది. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపైకి కాలువలోని మురుగునీరు చేరుతుండడంతో వాహనచోదకులు అవస్థలు గురవుతున్నారు. గురు వారం కురిసిన వర్షానికి టెక్కలిలో పలు కాలువలు మురుగునీరు జిల్లాపరిషత్ రోడ్డులోకి చేరింది. తక్షణమే పంచాయతీ అధికారులు కాలువల్లో పూడికలు తొల గించే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.