Share News

సెలవుపై కొత్తూరు తహసీల్దార్‌

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:06 AM

పలు అభియోగాలు, ఆరోపణలు రా వడంతో ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు తహసీల్దార్‌ కొప్పల బాలకృష్ణపై దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో మండలంలో వివిధ రకాలు ధ్రువ పత్రాల జారీ నిలిచిపోయింది.

సెలవుపై కొత్తూరు తహసీల్దార్‌

  • నిలిచిన ధ్రువపత్రాల జారీ

  • ఇబ్బందిపడుతున్న ప్రజలు

కొత్తూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): పలు అభియోగాలు, ఆరోపణలు రా వడంతో ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు తహసీల్దార్‌ కొప్పల బాలకృష్ణపై దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో మండలంలో వివిధ రకాలు ధ్రువ పత్రాల జారీ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పది రోజులుగా తహసీల్దార్‌ సెలవులో ఉండగా.. ఎవరికి ఇన్‌చార్జి బాధ్యతలు, అధి కారికంగా డిజిటల్‌ సైన్‌ అనుమతలు ఇవ్వకపోవడంతో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 300 విద్యార్థుల ధ్రువ పత్రాల జారీ నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత చదువులకు, వివిధ రకాల ఉద్యోగ ప్రయత్నాలకు ప్రయిత్నించే విద్యార్థులకు కుల, ఇతర ధ్రువ పత్రాలు కావల్సి ఉన్న, సచివాలయాలు ద్వారా నమోదైన పత్రాలు డిజిటల్‌ సైన్‌ లేకపోవడం సర్టిఫికెట్లు జారీ ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లా ఉన్నత అధికారులు స్పందించి సర్టిఫికెట్ల జారీపై దృష్టి సారించాలని మండల ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:06 AM