కొత్తమ్మతల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:24 PM
ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, అధికారులు, ప్రజల సహకారంతో కొత్తమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
కోటబొమ్మాళి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, అధికారులు, ప్రజల సహకారంతో కొత్తమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం సాయంత్రం టెక్కలి ఆర్డీవో ఎన్. కృష్ణమూర్తితో కలిసి కొత్తమ్మతల్లి జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని పరిశీలించారు. హెలికాఫ్ట్‌ర్ టూరిజం కోసం స్థానిక వంశధార విద ్యసంస్థల పక్కన ఉన్న ఖాళీస్థలం, జాతీయ రహదారి కొత్తపేట వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్న ఖాళీ స్థలాలను చూశారు. అంతకుముందు కొత్తమ్మతల్లిని కలెక్టర్, ఆర్డీవో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్, తహసీల్దార్ అప్పలరాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి వాకచర్ల రాధాకృష్ణ, సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ కోరాడ చిన్నగోవింద్, టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్, గ్రామ పెద్దలు కోరాడ పెద్ద గోవింద్, లోపింటి రఘురామరెడ్డి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.