కొత్తమ్మతల్లి జాతర ఆదాయం రూ.22 లక్షలు
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:09 AM
స్థానిక కొత్తమ్మతల్లి జాతర శతాబ్ది ఉత్సవాల ద్వారా మంగళ, బుధ, గురువారాల్లో రూ.22.08.481.00 ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు.
కోటబొమ్మాళి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక కొత్తమ్మతల్లి జాతర శతాబ్ది ఉత్సవాల ద్వారా మంగళ, బుధ, గురువారాల్లో రూ.22.08.481.00 ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధర్మహుండీలను దేవదాయ శాఖ అధికారులు, గ్రామపెద్దల సమక్షంలో లెక్కించారు. హుండీల ద్వారా రూ. 15.44,881, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.4.25.000, మొక్కుబడి టిక్కెట్లు ద్వారా రూ.2.38.600 ఆదాయం లభించిదన్నారు. గతేడాది కంటే ఈ సారి రూ.3.86.964 ఆదాయం పెరిగిందన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఏసీ బీఆర్‌వీవీ ప్రసాద్ పట్నాయక్, ధర్మకర్తలి మండలి చైర్మన్ కోరాడ గోవిందరావు, గ్రామపెద్దలు బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఉత్సవాలకు సహకరించిన అన్ని శాఖ అధికారులకు, ప్రజాప్రతి నిధులకు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.