ముగిసిన కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:11 AM
kothhamma festival కోటబొ మ్మాళిలో కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. మంగళవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు గురువారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. వేకువ జాము నుంచే వేలాదిమంది భక్తులు బారులుదీరి కొత్త మ్మతల్లిని దర్శించుకున్నారు.
చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు
కోటబొమ్మాళి, సెప్టెంబరు 25(ఆంఽధ్రజ్యోతి): కోటబొ మ్మాళిలో కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. మంగళవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు గురువారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. వేకువ జాము నుంచే వేలాదిమంది భక్తులు బారులుదీరి కొత్త మ్మతల్లిని దర్శించుకున్నారు. చీరలు, ముర్రాటలు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొత్తపేట జంక్షన్ నుంచి కోటబొమ్మాళి వరకు రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్డు భక్తులతో నిండిపోయింది. పగటివేషాలు, కొయ్య డ్యాన్సు లు భక్తులను అలరించాయి. పలువురు దాతలు భక్తులకు మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. సత్యసాయి సేవాసమితి సభ్యులు భక్తులసేవలో పాల్గొన్నారు. టెక్కలి సీఐ శ్రీనివాసరావు ఆధ్వ ర్యంలో ఎస్‌ఐ సత్యనారాయణతో పాటు సుమారు 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల్లో హెలీ టూరిజం, శోభాయాత్ర, విద్యుద్దీపాలంకరణ, జానపద, సాంఘిక నాటకాలు భక్తులకు అలరించాయి.
ఆకట్టుకున్న క్రాకర్స్ షో
కొత్తమ్మతల్లి ఉత్సవాల సందర్భంగా స్థానిక బాలుర జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన క్రాకర్స్ షో ఆకట్టుకుంది. వివిధ రకాల క్రాకర్లును కాల్చడం.. విన్యాసాలు చేయటంతో చూప రులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ, ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్ కోరాడ గోవింద్, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. మెయిన్‌రోడ్డులో విజయనగరం బృందం నిర్వహించిన జానపద నృత్యాలు, కొత్తమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో ఊడికలపాడు, శ్రీకాకుళానికి చెందిన బృందాల కోలాటం అలరించింది.