ప్రగతిపథంలో కోటబొమ్మాళి: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:00 AM
కోటబొ మ్మాళిని ప్రగతిపథంలో నడిపిస్తానని రాష్ట్ర మంత్రి కిజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
కోటబొమ్మాళి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): కోటబొ మ్మాళిని ప్రగతిపథంలో నడిపిస్తానని రాష్ట్ర మంత్రి కిజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఉప ఖజాన భవనం, జిల్లా పరిషత్ బాలికల అనుబంధ వసతి గృహం, సీసీ రోడ్డును ప్రారంభించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిర్మించనున్న అన్నాక్యాంటీన్ భవనానికి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్‌కి, పాత పిష్ మార్కెట్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్, పాతపట్నం అమ్మవారి గుడి పక్క నుంచి ఊరమ్మతల్లి ఆలయం వరకు సీసీరోడ్డు పను లకు శంకుస్థాపన చేశారు. కొత్తపేటకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వెళ్లిపోవడంతో కోటబొమ్మాళి బోసిపో యిందని, అందుకే డీసీసీబీ బ్యాంకు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించి, దుకాణాలను ఏర్పాటు చేసి టెక్కలి నుంచి శ్రీకాకుళం బస్సులు కోటబొమ్మాళి మీదు గా వెళ్లేలా చర్యలు తీసుకుంటానన్నారు. కొత్తపేట నుం చి కోటబొమ్మాళి పెద్ద చెరువు వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కోటబొమ్మాళి మండల కేంద్రంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపడ తామన్నారు. డిగ్రీ కళాశాల మంజూరుకు చర్యలు తీసుకుం టాన న్నారు.
కార్యక్రమంలో ఖజానాశాఖాధి కారి డాక్టర్ మోహనరావు, జిల్లా ట్రెజరీ అధికారి సీహెచ్. రవి కుమార్, టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, తహసీల్దార్ ఆర్.అప్పలరాజు, ఎంపీడీవో కె.ఫణీంద్ర కుమార్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరి వర ప్రసాద్, టీడీపీ నేతలు బోయిన గోవింద రాజులు, బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కీర్తిచక్ర పురస్కార గ్రహీతకు అభినందన
కోటబొమ్మాళి, జూన్ 28 (ఆఽంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి కీర్తి చక్ర పురస్కారం పొందిన సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడుకు మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అభినందించారు. శనివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో రాంగోపాల్ నాయు డు కుటుంబ సభ్యులతో కలిసి మర్యాద పూర్వకంగా మంత్రిని కలిశారు. ఉగ్రవాదు లను మట్టు పెట్టడంలో రాంగోపాల్ చూపి న ధైర్య సాహసాలను మంత్రి అభినంది స్తూ కీర్తిచక్ర పురస్కారం తీసుకోవడం జిల్లాకు గర్వకారణమని మంత్రి కొనియాడారు. అలాగే ఇండియన్ ప్రీమియం లీగ్‌లో ఢిల్లీ క్యాపి టల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన త్రిపు రాన విజయ్‌ని మంత్రి అభినందించారు. క్రికిట్ మ్యాచ్‌ల్లో మరింతగా ప్రతిభకనబరిచి ఆవకాశాలను అంది పుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.