చట్టాలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:36 PM
విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన అవసర మని జిల్లాన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
శ్రీకాకుళం లీగల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన అవసర మని జిల్లాన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియం, న్యూసెంట్రల్ స్కూల్‌లో బాలల దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. గుడ్ టచ్, బాడ్ టచ్‌లను తెలియజేశారు. ఆడపిల్లలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే తమ సంస్థ తగు న్యాయ సహాయం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, జిల్లా బాలల సంరక్షణాధికారి రమణ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.