Share News

కార్మిక చట్టాలపై అవగాహన అవసరం

ABN , Publish Date - May 07 , 2025 | 11:43 PM

కార్మిక చట్టాలపై అవగాహన అవసరమని జూనియ ర్‌ సివిల్‌ న్యాయాధికారి, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ పి.పరీష్‌కుమార్‌ అన్నారు.

కార్మిక చట్టాలపై అవగాహన అవసరం
కంచిలి/సోంపేట:మాట్లాడుతున్న న్యాయాధికారి కిశోర్‌బాబు

ఇచ్ఛాపురం, మే 7(ఆంధ్రజ్యోతి): కార్మిక చట్టాలపై అవగాహన అవసరమని జూనియ ర్‌ సివిల్‌ న్యాయాధికారి, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ పి.పరీష్‌కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల లీగల్‌ సర్వీ సెస్‌ కమిటీ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది ఎం.రాంబాబు, అంగన్వాడీ కార్యక ర్తలు, ఆటో, రిక్షా కార్మికులు పాల్గొన్నారు.

అవగాహన లేక ఇబ్బందులు

కంచిలి/సోంపేట, మే7(ఆంధ్రజ్యోతి): కార్మి కుల కోసం అనేకచట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన లేక అనేక ఇబ్బందులు పడుతు న్నారని ఆరవ అదనపు జిల్లా న్యాయాధికారి, మండల న్యాయసేవా అధికార సంఘం అధ్య క్షులు కిశోర్‌బాబు అన్నారు. బుధవారం నిర్వ హించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతీ కార్మికుడు ఇన్సూరెన్స్‌ చేయించుకోవాలని, ప్రమాదాలు జరిగినపుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నా రు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.శ్రీనివాసరావు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డి.జగన్నాయకులు, బేసి లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ పారినాయిడు, సోంపేట బార్‌ అధ్యక్షుడు జి.శైలేంద్ర పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 11:43 PM