తలుపులకు చెదపట్టి.. శ్లాబు పెచ్చులూడి
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:37 PM
జలుమూరులోని వ్యవసాయ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాల కిందట నిర్మించిన భవనం కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో తలుపు లకు చెదలుపట్టాయి. శ్లాబు పెచ్చులూడి పడుతుం డడంతో సిబ్బంది భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారు.
జలుమూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):జలుమూరులోని వ్యవసాయ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాల కిందట నిర్మించిన భవనం కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో తలుపు లకు చెదలుపట్టాయి. శ్లాబు పెచ్చులూడి పడుతుం డడంతో సిబ్బంది భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారు.
జలుమూరులో కొండ పక్కన ఇరవై ఏళ్ల కిందట వ్యవసాయశాఖ కార్యాలయం గోదాముకు భవనం నిర్మించారు. కింద భాగం గోదాముకు, పైన కార్యాలయంగా వినియోగానికి భవనం నిర్మించారు. కొన్నాళ్లు పాటు కింద గోదాముగా ఉపయోగించి వ్యవసాయ పరికరాలు, టార్పాలిన్లు ఉంచేవారు. భవనం నిర్మించిన తర్వాత కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. తలుపులు, కిటికీలు చెదలుపట్టాయి. కొండ పక్కనే గోదాము ఉండడంతో విషసర్పాలు, క్రిమికీటకాలు చేరేవి. దీంతో తలుపులు తేరవడానికి సిబ్బంది భయాందోళనలు చెందేవారు. పైభాగంగాలో కార్యాలయానికి వినియోగించిన భవనం శ్లాబు పెచ్చులూడుతుండడంతో ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని సిబ్బంది బిక్కుబిక్కుమని విధులు నిర్వర్తించేవారు. జలుమూ రులో వెలుగుకార్యాలయ భవనం ఖాళీగా ఉండడం తో మండలస్థాయి అధికారులు వ్యవసాయ కార్యాలయ వినియోగానికి దాన్ని ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవసాయ కార్యాలయ భవనం నిర్మాణానికి నిధులు మంజూరుకు చర్యలుతీసుకోవాలని సిబ్బంది, రైతులు కోరుతున్నారు.