సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా కిడ్నీ పరిశోధన కేంద్రం
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:36 AM
స్థానిక కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని సూపర్‌స్పెషాలిటీ ఆ సుపత్రి స్థాయికి తీసుకువెళ్లడా నికి ప్రభుత్వం కృత నిశ్చయం తో ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని సూపర్‌స్పెషాలిటీ ఆ సుపత్రి స్థాయికి తీసుకువెళ్లడా నికి ప్రభుత్వం కృత నిశ్చయం తో ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈ మే రకు రూ.2 కోట్ల వ్యయంతో ప్రభుత్వం సమకూర్చిన ల్యాప్రోస్కోపీ సర్జరీ పరిక రాలను గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఆసుపత్రి సూపరింటెం డెంట్ అల్లు పద్మజ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో 10 డయాలసిస్ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఏపీట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూ రావు, రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్, నాయ కులు గాలి కృష్ణారావు, మల్లా శ్రీనివాసరావు, టంకాల రవిశంకర్‌గుప్తా, గురిటి సూర్యనారాయణ, దువ్వాడ శ్రీకాంత్, ఎం.నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.