Share News

Kharif crops: పొలంబాట

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:43 PM

Rain-fed crops Farmer activities రుతుపవనాలు రాకతో జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ఖరీఫ్‌ పనులు ఆరంభమయ్యాయి. వర్షాలు అనుకూలిస్తుండడంతో రైతులు పొలంబాట పట్టారు. పొలాల గట్లు శుభ్రం చేసి.. వరి నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు.

Kharif crops: పొలంబాట
వరి నారు మళ్లు సిద్ధం చేస్తున్న రైతులు

  • జిల్లాలో ఖరీఫ్‌ పనులు ప్రారంభం

  • వరి నారుమళ్లు సిద్ధం చేస్తున్న రైతులు

  • మెళియాపుట్టి/ నరసన్నపేట, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): రుతుపవనాలు రాకతో జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ఖరీఫ్‌ పనులు ఆరంభమయ్యాయి. వర్షాలు అనుకూలిస్తుండడంతో రైతులు పొలంబాట పట్టారు. పొలాల గట్లు శుభ్రం చేసి.. వరి నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. మెళియాపుట్టి, మడపాం, మాకివలస, జమ్ము, సుందరాపురం, కంబకాయి తదితర ప్రాంతాల్లో రైతులు ఖరీఫ్‌ పనుల్లో నిమగ్నమయ్యారు. ట్రాక్టర్లతో దుక్కి దున్ని.. నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. మెట్టు ప్రాంతాల్లో రైతులు వేరుశనగ, మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా వ్యవసాయశాఖ అధికారులు కూడా ముందస్తుగానే విత్తనాలు, ఎరువులు పంపిణీకి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 4లక్షల ఎకరాల్లో వరిసాగు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే 38వేల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేశామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏటా విత్తనాల పంపిణీ ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. ఆ ఇబ్బందులు పునరావృతం కాకూడదని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రైతుసేవా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Jun 07 , 2025 | 11:43 PM