Share News

కేజీబీవీ ప్రిన్సిపాల్‌ ఆరోపణలు అవాస్తవం

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:05 AM

పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌ చేస్తున్న ఆరోప ణలన్నీ అవాస్త వాలే అని ఏపీ అసెంబ్లీ పీ యూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్‌ పేర్కొన్నారు.

కేజీబీవీ ప్రిన్సిపాల్‌ ఆరోపణలు అవాస్తవం
కూన రవికుమార్‌

శ్రీకాకుళం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌ చేస్తున్న ఆరోప ణలన్నీ అవాస్త వాలే అని ఏపీ అసెంబ్లీ పీ యూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అమెరికా నుంచి ఒక ప్రకట న విడుదల చేశారు. ఆ ప్రకటన వివరాలిలా.. ‘కేజీ బీవీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందు కే నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేసి.. నిత్యావస రాలను దారి మళ్లించడం తదితర అంశాలను ప్రశ్నించి నందుకే వైసీపీ నేతలతో కలిసి ప్రిన్సిపాల్‌ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ‘తల్లికి వందనం’ పై ముగ్గురుతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాను. కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌తోనే వీడియో కాల్‌ తీసుకున్నట్లు అబ ద్ధపు ఆరోపణలు. విద్యార్థినులతో ఇంట్లో పనులు చేయించుకోవడం, మెగా టీచర్‌-పేరెంట్‌ మీటిం గ్‌ కోసం విద్యార్థినుల నుంచి అక్రమంగా డబ్బు లు వసూలు చేస్తోందని తల్లిదండ్రుల ఫిర్యాదుల ఆధారం గా మాత్రమే నేను ప్రశ్నించాను. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవ హరించి గతంలో సస్పెండ్‌ అయిన చరిత్ర ఉన్న ఆ ప్రిన్సి పాల్‌ను అడ్డుపెట్టుకుని నాపై బురదజల్లేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారు. అమెరికా నుంచి తిరిగి రాగానే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తాను’ అని పేర్కొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 12:05 AM