Share News

హైకోర్టు ఆర్డర్‌తో బయలుదేరిన కేశవరావు బంధువులు

ABN , Publish Date - May 24 , 2025 | 11:39 PM

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ ప్రాంతంలో ఈనెల 20న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్ట్‌ చీఫ్‌ నంబాళ్ల కేశవరావు అలియాస్‌ బసవరాజు మృతదేహాన్ని స్వగ్రామ మైన కోటబొమ్మాళి మండలం జీయన్నపేట తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హైకోర్టు ఆర్డర్‌తో బయలుదేరిన కేశవరావు బంధువులు

టెక్కలి, మే 24(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ ప్రాంతంలో ఈనెల 20న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్ట్‌ చీఫ్‌ నంబాళ్ల కేశవరావు అలియాస్‌ బసవరాజు మృతదేహాన్ని స్వగ్రామ మైన కోటబొమ్మాళి మండలం జీయన్నపేట తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృత దేహాన్ని అప్పగించాలని ఆయన తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లీశ్వరరావు, పౌరహక్కుల సంఘం నేతలు శుక్రవారం హైకోర్టు ను ఆశ్రయించారు. ఈమేరకు హైకోర్టు ఆర్డర్‌తో మృతదేహం తీసుకు వచ్చేందుకు కేశవరావు బంధువులు, గ్రామస్థులు జగదల్‌పూర్‌కు బయలుదేరి వెళ్లారు. మూడురోజులు కిందట జీయన్నపేట నుంచి కేశవరావు బంధువులు జగదల్‌పూర్‌కు వెళ్లగా ఇప్పట్లో మృతదేహం ఇవ్వడం సాధ్య పడదని అక్కడి పోలీసులు తెలియజేయడం, తిరిగి రావాలని జిల్లా పోలీసులు సూచిం చడంతో వారంతా తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. కేశవరావు సోదరుడు ఢిల్లేశ్వరరావు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపా రాణి నివాసంలో ఉండడంతో పోలీసులు, షాడో బృందం, ఎస్‌ఐ స్థాయి అధికారితో నిఘా పెట్టారు. ఇక కేశవరావు మృతదేహం రాక అనుకున్నట్లు జరిగితే సోమ వారం జీయన్నపేటలో అంత్యక్రియలు నిర్వహణకు కుటుం బ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నందిగాం, మే 24(ఆంధ్ర జ్యోతి): కొత్తగ్రహారం సమీపం లోని హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బడగాం పంచాయతీ శారదా పురం గ్రామానికి చెందిన బూరె నారాయణరావు(59) ద్విచక్ర వాహనంపై కొత్తగ్రహారం వెళ్లి తిరిగి స్వగ్రా మానికి వెళ్లేందుకు సర్వీసు రహదారి నుంచి యూటర్న్‌ తీసుకుంటుం డగా పలాస నుంచి టెక్కలి వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో నారాయ ణరావుకు బలమైన గాయాలు కావడంతో స్థానికుల సమాచారం మేరకు హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తర లించారు. అక్కడ చికిత్స పొందుతూ నారాయణరావు మృతి చెందాడు. భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ జీవీ రమణ కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు వివా హితులైన కుమార్తెలు ఉన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:39 PM