Share News

జీయన్నపేటలో కేశవరావు కర్మఖాండలు

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:55 PM

మావోయిస్టు చీఫ్‌ నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు కర్మఖాండలను ఆదివారం ఆయన స్వగ్రామం జీయన్నపేటలో కుటుంబసభ్యులు నిర్వహించారు.

జీయన్నపేటలో కేశవరావు కర్మఖాండలు
కర్మఖాండలు నిర్వహిస్తున్న నంబాల సోదరులు

- గ్రామంపై పోలీసుల నిఘా

టెక్కలి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు చీఫ్‌ నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు కర్మఖాండలను ఆదివారం ఆయన స్వగ్రామం జీయన్నపేటలో కుటుంబసభ్యులు నిర్వహించారు. గతనెల 21న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేశవరావు మృతి చెందారు. అక్కడే ఆయన మృతదేహాన్ని పోలీసులు దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పెద్దసోదరుడు నంబాల ఢిల్లేశ్వరరావు, చిన్నసోదరుడు రాంప్రసాద్‌, కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు కలిసి హిందూ సంప్రదాయం ప్రకారం కేశవరావు కర్మఖాండ లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల నాయకులు, సాను భూతిపరులు, అభిమానులు హాజరవుతారనే అనుమానంతో పోలీసులు జీయన్నపేటపై నిఘా పెట్టారు. రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, కోటబొమ్మాళి, నౌపడా ఎస్‌ఐలు సత్యనారాయణ, నారాయణస్వామి జీయన్నపేటకు వచ్చీపోయే వారి వివరాలను ఆరాతీశారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి.. కేశవరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

Updated Date - Jun 01 , 2025 | 11:55 PM