పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:58 PM
ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం రూరల్, అక్టోబరు18 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, జీఎస్టీ తగ్గింపుపై అవగాహనకు శనివారం రాగోలు గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలను పెంచాలన్నారు. జీఎస్టీపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. రాగోలు ప్రధాన రహదారిపై మొక్కలు నాటారు. కార్య క్రమంలో తహసీల్దార్ ఎం.గణపతి, ఎంపీడీవో వి.ప్రకాష్ రావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
కాలుష్య నివారణకు సహకరించాలి
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీ వో ఎం.వేంకటేశ్వరరావు అన్నారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బ్యాటరీ బైక్‌ల విని యోగంపై కలెక్టరేట్ సిబ్బందికి అవగాహన కలిగించారు. ఎంవీఐ పీవీ గంగాధర్ మాట్లాడుతూ.. బ్యాటరీ వాహ నాలతో పొల్యూషన్ ఉండదని వీటితో వావరణం ప్రభా వితం కాదన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రపై డిప్యూటీ కలెక్టర్ పద్మావతి ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్ ఏవో జీఏ సూర్యనారాయణ, పలు విభాగాల పర్యవేక్షకులు రామ మూర్తి, సురేష్, రామకృష్ణ, పాల్గొన్నారు.