Share News

రెండు నెలల్లో కార్గిల్‌ పార్కు పనులు పూర్తి

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:57 PM

నగరంలోని కార్గిల్‌ విక్టరీ పార్కు అభివృద్ధి పనులను రెండు నెలలో పూర్తి చేస్తామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

రెండు నెలల్లో కార్గిల్‌ పార్కు పనులు పూర్తి
క్లబ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): నగరంలోని కార్గిల్‌ విక్టరీ పార్కు అభివృద్ధి పనులను రెండు నెలలో పూర్తి చేస్తామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. బుధవారం సాయంత్రం అసిస్టెంట్‌ కలెక్టర్‌ డి.పృథ్వీరాజ్‌కుమార్‌, సుడా ఈఈ పొగిరి సుగు ణాకరరావుతో కలిసి జడ్పీ కార్యాలయం ఎదు ట ఉన్న హెచ్‌బీ కాలనీలోని పార్కు పనులను పరిశీలించారు. పనులు ఎంతమేరకు వచ్చాయో అధికా రులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పార్కును సమతలం చేసే పనులు సాగుతున్నాయని, గడువు లోగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని వారు వివరించారు. కార్యక్రమంలో 31వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి విభూది సూరిబాబు, సకలాబత్తుల శ్రీనివాస్‌, మునిసిపల్‌ సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.

కాస్మోపోలిటన్‌ క ్లబ్‌ అభివృద్ధికి చర్యలు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ చరిత్ర కలిగిన కాస్మోపోలిటన్‌ క్లబ్‌ను అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకువస్తామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంక ర్‌ అన్నారు. నగరం లోని క్లబ్‌ను బుధ వారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లబ్‌కు ఆర్థిక సమృద్ధిని కల్పించేలా ప్రణాళిక లను సూచించారు. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న క్లబ్‌ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించ డం ద్వారా నెలవారీ అద్దెల ఆదాయంతో క్లబ్‌ను ఆధునికీ కరించ వచ్చన్నారు గతంలో ఎంతోమంది ఐఏఎస్‌, ఏపీఎస్‌ అధికారులు బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ ఆడేం దుకు ఈ క్లబ్‌కు వచ్చే వారన్నారు. మరలా ఉన్నతాధి కారులు, మాజీ ఉద్యోగులు క్లబ్‌కు వచ్చేలా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. క్లబ్‌ కార్యదర్శి సురంగి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 11:57 PM