కందమాల్ టు బెంగళూర్
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:48 PM
ఒడిశాలోని కందమాల్ జిల్లా నుంచి కర్ణాటకలోని బెంగళూర్‌కు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. గురువారం పట్టణ ఎస్‌ఐ ముకుందరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఇచ్ఛాపురం, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని కందమాల్ జిల్లా నుంచి కర్ణాటకలోని బెంగళూర్‌కు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. గురువారం పట్టణ ఎస్‌ఐ ముకుందరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఐ కథనం మే రకు.. కొరాపుట్ జిల్లాకు చెందిన ప్రశాంత్ కుమార్‌పాడి, గంజాం జిల్లాకు చెందిన కందులు పూర్ణచంద్ర శానాపతి కందమాల్ జిల్లాకు చెందిన బపూని దిఘాల్ వద్ద గంజాయిని కొనుగోలు చేశారు. దీనిని బెంగళూర్‌లో ఉంటున్న ఆలి అలియాస్ సర్దార్ అనే వ్యక్తికి అమ్మే క్రమంలో గురువారం ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ ముకుందరావుకు సమాచారం వచ్చింది. వెంటనే ఆయన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్‌కు చేరుకొన్నారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపిం చిన వీరిద్దరిని పట్టుకుని తనిఖీచేశారు.వారి వద్ద నుంచి6 కేజీల 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
17 మద్యం సీసాలు..
ఆమదాలవలస, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధి గణేష్ నగర్‌కు చెందిన ఎస్.సరళను 17 మద్యం బాటిళ్లతోఅరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సీపాన కాంతారావు తెలిపారు. గురువారం ఉదయం అందిన సమాచారం మేరకు గణేష్ నగర్‌లోని ఆమె ఇంటిలో తనిఖీ నిర్వహించామన్నారు. అక్ర మంగా 17 మద్యం బాటిళ్లను నిల్వ ఉంచినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.