Share News

27 నుంచి కమ్మసిగడాం జాతర: ఎన్‌ఈఆర్‌

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:50 PM

కమ్మసిగడాం మహాలక్ష్మి జాతర జనవరి 27 నుంచి 29 వరకూ జరగనుందని ఆలయ కమిటీ ప్రధాన కార్య దర్శి, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.

 27 నుంచి కమ్మసిగడాం జాతర: ఎన్‌ఈఆర్‌
నియామక పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ :

రణస్థలం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):కమ్మసిగడాం మహాలక్ష్మి జాతర జనవరి 27 నుంచి 29 వరకూ జరగనుందని ఆలయ కమిటీ ప్రధాన కార్య దర్శి, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.సోమవారం కమ్మసిగడాం మహాలక్ష్మీతల్లి అమ్మవారి కళ్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం నిర్వ హించారు.ఈ సందర్భంగా జాతర సక్రమంగా నిర్వహణ, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాల కోసం చర్చించారు. కార్యక్రమంలో కమిటీ ఉపాఽధ్యక్షుడు వెలిచేటి రామకృష్ణ, కోశాధికారి వెలిచేటిరాజశేఖర్‌, కార్యద ర్శులు మన్నె లక్ష్మీప్రసాద్‌, సురేష్‌కుమార్‌, మురళీధర్‌ పాల్గొన్నారు.

అంకిత భావంతో పనిచేయాలి

విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి మంచి భవిష్యత్‌ ఉం టుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. రణస్థలం ఐసీడీఎస్‌ పరిధిలో పనిచేస్తున్న 22 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రధాన కార్యకర్తలగా స్థాయిని పెంచుతూ ఉత్తర్వులొచ్చాయి. వారికి సంబంధించిన నియామక పత్రాలను సోమవారంఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో రూపలత పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:50 PM