Share News

కూటమి సంబరాలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:13 AM

రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన ముగిసి, ప్రజా పాలన ప్రారంభమై బుధవారం నాటికి ఏడాది పూర్తయింది. దీంతో జిల్లాలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు.

 కూటమి సంబరాలు
ఆమదాలవలసలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్న టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు

- ప్రజా పాలనకు ఏడాది పూర్తి

- బాణసంచా కాల్చి శ్రేణుల సందడి

రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన ముగిసి, ప్రజా పాలన ప్రారంభమై బుధవారం నాటికి ఏడాది పూర్తయింది. దీంతో జిల్లాలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగన్‌ పాలనలో ఐదేళ్ల పాటు ఎన్నో దోపిడీలు, అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:13 AM