కనుల పండువగా కామదహనోత్సవం
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:07 AM
): ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మ క్షేత్రంలో బుధవారం రాత్రి కామ దహనోత్స వాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఏటా ఫాల్గుణ మాసం శుద్ధ త్రయోదశి నుంచి పూర్ణిమ వరకూ డోలోత్సవాలు నిర్వహించడం సంప్రదా యంగా వస్తోంది.

గార, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మ క్షేత్రంలో బుధవారం రాత్రి కామ దహనోత్స వాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఏటా ఫాల్గుణ మాసం శుద్ధ త్రయోదశి నుంచి పూర్ణిమ వరకూ డోలోత్సవాలు నిర్వహించడం సంప్రదా యంగా వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, నిత్య పూజలు చేశారు. మేళతాళాలతో రాత్రి తిరువీధి నిర్వహించారు. శేష వాహనం పైన గోవిందరాజ స్వామి, శ్రీదేవి, భూదేవి, విగ్రహాలను, అశ్వవాహ నంపై లక్ష్మణ స్వామి వారి విగ్రహం ఉంచారు. పెద్ద పుష్పక వాహనంపై సీతారాములు విగ్రహాలను, చిన్న పల్లకీపై సుదర్శన పెరుమాళ్‌ను ప్రధాన అర్చకులు చామర్ల సీతారామ నరసింహా చార్యులు, ఇతర అర్చక బృందం కొలువుదీర్చారు. మేళతాళాలతో కామ దహన మండపం వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ అర్చక బృందం ముందుగా విశ్వక్షేణ పూజ, పుణ్యా హవచనం, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. పుణ్యాహవచన జలంతో ముందుగా సిద్ధం చేసి ఉంచిన కొబ్బరి కమ్మపై సంప్రోక్షణ చేశారు. అనంతరం హోమాగ్నితో ఆ కొబ్బరి కమ్మకు అర్చక స్వాములు నిప్పంటించారు. ఈ ఉత్స వాన్ని తిలకించడానికి అశేషంగా భక్తులు తరలి వచ్చారు. అనంతరం కామ దహన ప్రదేశం చుట్టూ స్వామి వారు వాహనాల్లో మూడుసార్లు ప్రదక్షిణ చేస్తూ... తిరిగి మేళతాళాలతో ఆలయానికి చేరుకున్నారు. ఉత్సవం పూర్తయిన తర్వాత అక్కడి భస్మాన్ని భక్తులు నుదుట బొట్టుగా ధరించారు. ఈ కార్యక్ర మంలో ఈవో గురునాథరావు, స్థానిక పెద్దలు, భక్తు లు పాల్గొన్నారు. సి.ఐ.పైడపునాయుడు, ఎస్.ఐ జనా ర్దనరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.