మండల ఉపాధ్యక్షురాలిగా కల్యాణి ఏకగ్రీవం
ABN , Publish Date - May 19 , 2025 | 11:51 PM
మండల ఉపాధ్యక్షురాలిగా మాళువ ఎంపీటీసీ జమ్మినివలస కల్యాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
టీడీపీ మద్దతురాలికి వరించిన పదవి
జలుమూరు (సారవకోట) మే 19(ఆంధ్రజ్యోతి): మండల ఉపాధ్యక్షురాలిగా మాళువ ఎంపీటీసీ జమ్మినివలస కల్యాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వైస్ ఎంపీ పీగా వ్యవహరించిన యడల్ల అసిరయ్య మృతి చెందడంతో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నిక ఎన్నికల అధికారి మంద లోకనాథం వైస్ ఎంపీపీకి ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు కల్యాణి పేరును సూచించగా కిట్టాలపాడు ఎంపీటీసీవిజయకుమారి ప్రతిపాదించారు. గుంపాడ ఎంపీటీసీ పంగ అప్పారావు బలపరిచారు. ఈ ఎన్నికకు 12 మంది ఎంపీటీసీలు హాజరుకాగా మండల ఉపాధ్యక్షుడు గుణుపూర్ రామారావు మినహా మిగిలిన 11 మంది కల్యాణికి మద్దతుగా చేతులెత్తడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు మండల ప్రత్యేకాధికారి లోకనాథం ప్రక టించి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. అనంతరం ఆమెను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మండల అభివృద్ధికి కృషి చేస్తా: కల్యాణి
మండల అభివృద్ధికి ఎమ్మెల్యే రమణమూర్తి, ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు సహకారం తో కృషి చేస్తానని మండల ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన జమ్మినివలస కల్యాణి అన్నారు. ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్న తరువాత ఆమె మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.