Kalajatha కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా 6న కళాజాత
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:57 PM
Kalajatha కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా మే 6న నిర్వహిస్తున్న కళాజాతను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకుడు మద్దిల రామారావు కోరారు.
కాశీబుగ్గ, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా మే 6న నిర్వహిస్తున్న కళాజాతను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకుడు మద్దిల రామారావు కోరారు. కాశీబుగ్గ సీఐటీయూ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఇక్కడి ప్రజలెవరూ కార్గో ఎయిర్ పోర్టు కోర డం లేదని వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి శివారు భూ ములకు రెండు పంటలకు నీరివ్వాలని మాత్రమే వారు కోరు తున్నారన్నారు. ఎయిర్ పోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటికే జిల్లాలో నిర్వాసి తులైన ప్రజలకి ఎవరికైనా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. సమావేశంలో కార్గో ఎయిర్‌పోర్టు పోరాట కమిటీ అధ్యక్షుడు వాసు, కార్యదర్శి అప్పారావు, మోహన్‌రావు, మాధవరావు, కుసుమ, చాపర వేణు పాల్గొన్నారు.