poland: పోలాండ్‌లో కైజోల వాసి మృతి
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:16 PM
death in Poland ఉపాధి కోసం రెండున్నరేళ్ల కిందట పోలాండ్ దేశం వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో వెల్డింగ్ పనిచేస్తూ.. వచ్చిన డబ్బుల్లో కొంతమొత్తాన్ని స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు పంపించే వాడు. కానీ అక్కడ ఏమి జరిగిందో.. ఏమో ఈ నెల 21న తాను ఉంటున్న ఇంట్లోనే విగతజీవిగా మారాడు. ఆయన మరణించిన సమాచారం తెలుసుకుని తల్లిదండ్రులు, భార్యా పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని కుటుంబ సభ్యుల వేడుకోలు
కేంద్రమంత్రి, ఎమ్మెల్యేకి వినతి
పలాస రూరల్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం రెండున్నరేళ్ల కిందట పోలాండ్ దేశం వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో వెల్డింగ్ పనిచేస్తూ.. వచ్చిన డబ్బుల్లో కొంతమొత్తాన్ని స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు పంపించే వాడు. కానీ అక్కడ ఏమి జరిగిందో.. ఏమో ఈ నెల 21న తాను ఉంటున్న ఇంట్లోనే విగతజీవిగా మారాడు. ఆయన మరణించిన సమాచారం తెలుసుకుని తల్లిదండ్రులు, భార్యా పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించా రు. ఆయన మృతదేహం కోసం ఆరు రోజులు గా ఎదురుచూస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. పలాస మండలం కైజోల గ్రామానికి చెందిన బుడద దామోదర్(30) ఈ నెల 21న పోలాండ్ దేశంలో మృతి చెందాడు. దామో దర్‌కు తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, పున్న మ్మ, ఇద్దరు అన్నదమ్ములు, భార్య నీలవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం. తండ్రి దివ్యాంగుడు. మరో అన్నయ్య కూడా దివ్యాంగ పరిస్థితిలోనే ఉండ డంతో దామోదర్ కుటుంబ బాధ్యత లు చూసుకునేవాడు. ఐటీఐ వృత్తి విద్య కోర్సుచేసి వెల్డర్‌గా పలు కం పెనీల్లో పనిచేశాడు. ఆ అనుభవంతో రెండున్నరేళ్ల కిందట పోలాండ్ దేశం వార్సాలో ఓ కంపెనీలో చేరాడు. అక్కడ వెల్డింగ్ పనులు చేస్తూ ఉపాధి పొందేవాడు. గతేడాది డిసెంబరులో స్వగ్రా మానికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. పోలాండ్‌లో మరో కం పెనీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వారికి చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత జనవరిలో తిరిగి పోలాండ్ వెళ్లిపోయాడు. ఇంతలో ఏమైందో.. కానీ తాను నివసిస్తున్న ఇంట్లోనే దామోదర్ మృతి చెందినట్టు ఈ నెల 21న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు ఇక దిక్కెవరంటూ విలపించారు. ఆరు రోజులుగా ఆయన మృతదేహం కోసం ఎదురు చూస్తు న్నారు. పోలెండ్ నుంచి దామోదర్ మృతదే హాన్ని తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి ఆ వివరాలను విదేశీ రాయబారుల శాఖ ఆధ్వర్యంలో పోలెండ్ రాయబార కార్యాలయానికి చేరవేసినట్టు సమాచారం. ఆది వారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామ స్థులు విషాదంలో మునిగిపోయారు.