Share News

కార్మికులకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:51 PM

కార్మికులకు శాశ్వత సెటిల్‌మెంట్‌ చేయాలని, పెండింగ్‌ జీతాలు చెల్లించాలని, లే కుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీజీఐ కంపెనీ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు టి.తిరుపతిరావు హెచ్చరించారు.

కార్మికులకు న్యాయం చేయాలి
జడ్పీ కార్యాలయ గేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): కార్మికులకు శాశ్వత సెటిల్‌మెంట్‌ చేయాలని, పెండింగ్‌ జీతాలు చెల్లించాలని, లే కుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీజీఐ కంపెనీ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు టి.తిరుపతిరావు హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎన్‌జీవో హోమ్‌ నుంచి జడ్పీ కార్యాలయం వరకు ర్యాలీ వె ళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీజీఐ కంపెనీ స్థాపించిన 20 ఏళ్ల నుంచి కార్మికులందరూ పని చేస్తున్నారన్నారు. ఆరేళ్ల కిందట సాంకేతిక కారణాలో మూసివేశా రని, ఇంతకాలం ఎటువంటి సెటిల్‌మెంట్‌ చేయకపోవడం అన్యా యమన్నారు. అనంతరం డీఆర్వో వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పి.రాము, ఎస్‌.ప్రసాద్‌, జి.కామయ్య, బి.లక్ష్మణ, ఆదినారాయణ, లచ్చయ్య, గురుమూర్తి, రాంబాబు, మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 11:51 PM