మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:02 AM
బెండిగేటు సమీపంలో బాబా గుడి వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కొండవూరుకు చెందిన కొరికాన చైతన్య (29) మృతి చెందగా.. అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామస్థులు మృతదేహంతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
వజ్రపుకొత్తూరు/ నందిగాం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): బెండిగేటు సమీపంలో బాబా గుడి వద్ద శని వారం రాత్రి ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కొండవూరుకు చెందిన కొరికాన చైతన్య (29) మృతి చెందగా.. అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామస్థులు మృతదేహంతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. డీఎస్పీ వెంక ట అప్పారావు ఆందోళనకారులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. వివరాలిలా ఉన్నాయి.. రోడ్డు ప్రమా దంలో నందిగాం మండలం కవిటి అగ్రహారానికి చెంది న పిట్ట అర్జునరావుకు చెందిన ట్రాక్టర్ ఢీకొని చైతన్య అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై ట్రాక్టర్ యజమాని అర్జునరావు తగిన విధంగా స్పం దించకపోవడంతో కొండవూరు గ్రామస్థులు ఆందోళన కు దిగారు. అయినా ట్రాక్టర్ యజమాని స్పందన లేక పోవడంతో ధర్నాను ఉధృతం చేసి మృతుడి కుటుం బానికి న్యాయం చేయాలని నినదిస్తూ వాహనాల రాకపోకలకు నిలుపుదల చేశారు. దీంతో ఉద్రిక్త పరి స్థితులు నెలకొన్నాయి. న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు ఆందోళనకారులతో సంప్ర దించి ధర్నా విరమించాలని కోరారు. అప్పటికే రోడ్డు పై ఉన్న మహిళలు, యువకులు అంగీకరించలేదు. దీంతో ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మా ట్లాడారు. మృతదేహంతో రోడ్డుపై ఇన్ని గంటల పాటు ధర్నా చేయడం సరికాదన్నారు. ట్రాక్టర్ యజ మానితో మాట్లాడి మృతుడి కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విర మించారు. నందిగాం ఎస్‌ఐ షేక్‌మహమ్మద్ ఆలీ వజ్రపుకొత్తూరు, నందిగాం పోలీసులు పాల్గొన్నారు.
మొదట గుర్తు తెలియని వాహనంగా గుర్తింపు
శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చైతన్యకు ఢీకొట్టిన వాహనాన్ని మొదట గుర్తుతెలి యని వాహనంగా నమోదు చేశారు. తరువాత కొండ వూరు యువత సమాచారం సేకరించడంతో సదరు ట్రాక్టర్ పిట్ట అర్జునరావుదని, ఆ వాహనం ఢీ కొనడం వల్లే చైతన్య మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో పిట్ట కామేష్ ట్రాక్టర్ డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. అయితే ఆదివారం పలాస ఆసుపత్రిలో చైతన్య మృతదేహానికి పోస్టుమార్టం సమయంలో వచ్చిన ట్రాక్టర్ యజమాని అర్జునరావు కొండవూరు పెద్దలతో మాట్లాడి చైతన్య కుటుంబాన్ని ఆదుకుంటా మని మొదట హామీ ఇచ్చి ఆ తరువాత కనిపించక పోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్దకు వందలాది మంది గ్రామ స్థులు తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.