Share News

తుఫాన్‌ బాధితులందరికీ న్యాయం చేయాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:42 PM

minister achhenna meeting ‘జిల్లాలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి. కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలిగేలా చర్యలు తీసుకోవాల’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

తుఫాన్‌ బాధితులందరికీ న్యాయం చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

- అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

కోటబొమ్మాళి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి. కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలిగేలా చర్యలు తీసుకోవాల’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి పంట నష్ట వివరాలు సమగ్ర ంగా నమోదు చేయాలి. పక్కాగా నివేదికలు రూపొందించాలి. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి. టెండర్లు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్డు, బీటీ రహదారుల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదు. దీనిపై పర్యవేక్షణ అధికారులే పూర్తి బాధ్యత వహించాల’ని స్పష్టం చేశారు. అలాగే వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:42 PM