టీడీపీతోనే అంగన్‌వాడీలకు న్యాయం: బగ్గు
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:51 PM
అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదోన్నతి పొందిన మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు నియామక ఉత్తర్వులు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పంపిణీ చేశారు.
పోలాకి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదోన్నతి పొందిన మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు నియామక ఉత్తర్వులు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పంపిణీ చేశారు. నరసన్నపేట, పోలాకి, సారవకోట మండలాల్లో మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు పదోన్నతి కల్పిస్తూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వులను సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. టీడీపీ హయాంలోనే అంగన్‌వాడీలకు జీతాలు పెంపుచేశారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పదోన్నతి లభించిందన్నారు. గత వైసీపీ హయాంలో మినీ కార్యకర్తలు 45రోజులపాటు సమ్మె చేసినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, ప్రాజెక్టు అధికారులు వంశీప్రియ, శోభారాణి, సంఘ నాయకులు డోల సరోజని తదితరులు పాల్గొన్నారు.