ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే..
ABN , Publish Date - May 08 , 2025 | 12:00 AM
ఉద్యోగం లో చేరిన మూడు నెల లకే ఓ యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళం రిమ్స్ నర్సింగ్ కళాశాలలో ల్యాబ్ అటెండర్‌గా పనిచేస్తున్న గౌడ కిషోర్(23) ఉద్యోగ నిర్వహణలో భాగంగా విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్లాడు.
శ్రీకాకుళం రిమ్స్, మే 7(ఆంధ్రజ్యోతి): ఉద్యోగం లో చేరిన మూడు నెల లకే ఓ యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళం రిమ్స్ నర్సింగ్ కళాశాలలో ల్యాబ్ అటెండర్‌గా పనిచేస్తున్న గౌడ కిషోర్(23) ఉద్యోగ నిర్వహణలో భాగంగా విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్లాడు. పని ముగి సిన తరువాత తిరుగు ప్రయాణంలో బుధవారం బస్సులో వస్తుండగా గన్నవరం వద్ద గుండెలో నొప్పి రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కిశోర్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని వద్ద గల సెల్‌ఫోన్ ద్వారా వివరాలను తెలియజేయడంతో కళాశాల సిబ్బంది, మిత్రులు హుటాహుటిన తరలివెళ్లారు. కిశోర్ తండ్రి చనిపోగా తల్లి మాత్రమే ఉంది. ప్రస్తుతం నగరంలోనే ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడని,ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉద్యోగంలో చేరాడని స్నేహితులు తెలిపారు.
పండగకు వచ్చి.. విగతజీవిగా మారి
బావిలో పడి విద్యార్థి మృతి..
రణస్థలం, మే 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని అర్జునవలస సమీ పంలోని బావిలో పడి వడ్డాది గౌత మ్‌రాజ్‌కుమార్ (15) బుధవారం మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. విశాఖపట్నంకు చెందిన గౌతమ్ తన తల్లిదండ్రులతో కలిసి అర్జునవలసలో జరిగిన గ్రామ దేవత పండగకు వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం మరో విద్యార్తి దుర్గా ప్రసాద్‌తో కలిసి స్నానం చేసేందుకు బావి వద్దకు వెళ్లాడు. బావిలోకి దిగిన గౌతమ్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. గౌతమ్ ఇటీవల పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. తండ్రి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.