ప్రజలు మెచ్చిన సాహితీవేత్త జాషువా
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:56 PM
ప్రజలు మెచ్చిన సాహితీవేత్త జాషువా అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య అన్నారు.
ఎచ్చెర్ల, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రజలు మెచ్చిన సాహితీవేత్త జాషువా అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య అన్నారు. వర్సిటీలో నవయుగ కవి చక్రవర్తి, కవితా విశారద గుర్రం జాషువా జయంతిని శనివారం నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజికంగా ఉన్న మూఢాచారాలను తన కవిత్వం ద్వారా ఎదిరించారన్నారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.