వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:32 AM
కూటమి పాలనపై రోజు రోజుకీ ప్రజాదరణ పెరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సుమారు వెయ్యి వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరగా.. వారికి టీడీపీ కండువా వేసి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
పాతపట్నం/రూరల్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కూటమి పాలనపై రోజు రోజుకీ ప్రజాదరణ పెరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సుమారు వెయ్యి వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరగా.. వారికి టీడీపీ కండువా వేసి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. పాతపట్నం జడ్పీటీసీ లింగాల ఉషారాణి ఆధ్వరం్యలో 500 వైసీపీ కుటుంబాలు, సీతారాంపల్లి సర్పంచ్, వైస్‌సర్పంచ్ ఆధ్వర్యంలో 250 వైసీపీ కుటుంబాలు, కోదూరు గ్రామం నుంచి మాజీ జడ్పీటీసీ జన్ని చిన్నమ్మి, జన్ని అప్పన్న ఆధ్వర్యంలో 100 వైసీపీ కుటుంబాలు, సీహెచ్‌సీ మాజీ డైరెక్టర్ కనకల కర్రెన్న ఆధ్వర్యంలో 100 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. అలాగే పోలుబోతు నుంచి 20, హెచ్.గోపాలపురం నుంచి 20, సరాళి నుంచి 10 వైసీపీ కుటుంబాలతో టీడీిపీ లో చేరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైల బాబ్జీ, సైలాడ సతీష్, శివాల చిన్నయ్య, ఆనం దరావు, రామారావు, మన్మఽథరావు పాల్గొన్నారు.
ఎల్‌ఎన్ పేట, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పెద్ద కోట గ్రామంలో రూ.55 లక్షలతో విలేజ్ హెల్త్‌క్లినిక్ భవన నిర్మాణానికి మంగళవారం ఆయన శంకు స్థాపన చేశారు. తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ, వంశధార ప్రాజెక్టు వైస్ ఛైర్మన్ వి.ఆనందరావు, పీఏసీఎస్ చైర్మన్ కె.మన్మథరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కె.కృష్ణమాచారి, నాయకులు ఎం.మోహన రావు, కె.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
హిరమండలం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కొత్తూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 35 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉద్యోగో న్నతి పొందారు. వీరికి నియామక పత్రాలను హిరమండలంలోని ఓ కల్యాణ మండలంలో మం గళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. కార్యక్రమం లో జడ్పీటీసీ పి.బుచ్చిబాబు, మండల ప్రత్యేకాహ్వా నితులు తూలుగు తిరుపతిరావు, ఎంపీటీసీ చింతాడ బుడ్డు, పీఏసీఎస్ చైర్మన్ గోళ్ల సింహాచ లం, సర్పంచ్ లంక రోజారాణి, నాయకులు నాగేశ్వరరావు, ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.