బ్యాంకుల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:38 PM
బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యో గాలను వెంటనే భర్తీచేయాలని, ఐదు రోజుల పని దినాలను అమలు చేయా లని యునైటెడ్ ఫారంఆఫ్ బ్యాంకు యునియన్ కన్వీనర్ బి.శ్రీనివాసులు కోరారు.

శ్రీకాకుళం అర్బన్, మార్చి11(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యో గాలను వెంటనే భర్తీచేయాలని, ఐదు రోజుల పని దినాలను అమలు చేయా లని యునైటెడ్ ఫారంఆఫ్ బ్యాంకు యునియన్ కన్వీనర్ బి.శ్రీనివాసులు కోరారు. మంగళవారం శ్రీకాకుళంలోని సింహద్వారం వద్ద ఉన్న యూనియ న్ బ్యాంకు రీజినల్ కార్యాలయం ఎదుట యునైటెడ్ ఫారం ఆఫ్‌బ్యాంకు యు నియన్ పిలుపు మేరకు ఉద్యోగులు, అధికారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, రీజనల్ కార్యదర్శి కె.తేజేశ్వరరావు, గిరిధర్ నాయక్‌లు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులపై దాడులను ప్రభుత్వం ఖండించాలన్నారు. తాత్కాలిక పద్ధతిలోచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్ర త కల్పించాలని, ఉద్యోగుల రుణసముదాయాలపై ట్యాక్స్ వసూలు చేసే ఆలో చనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో యూనియ న్ సభ్యులుకరుణ, శ్రావణి, సూర్య, నరేష్, సూర్యకిరణ్, ఉపేంద్ర పాల్గొన్నారు.