జీవో-110 అమలు చేయాలి
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:56 PM
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ (ఆర్జీ యూకేటీ) పరిధిలో నాలుగు ట్రిపుల్ క్యాంపస్‌ల్లో చేస్తున్న తమను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా గుర్తించాలని ట్రిపుల్ ఐటీ గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు కోరారు.ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మంగళవారం అమరావతిలో రెడ్డి లక్ష్మణ్‌నాయుడు, పి.నవీన్, వై.నారాయణరావు, నజీర్, లోక్‌నాథ్ తదితరులు వినతిపత్రం అందజేశారు.
ఎచ్చెర్ల, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ (ఆర్జీ యూకేటీ) పరిధిలో నాలుగు ట్రిపుల్ క్యాంపస్‌ల్లో చేస్తున్న తమను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా గుర్తించాలని ట్రిపుల్ ఐటీ గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు కోరారు.ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మంగళవారం అమరావతిలో రెడ్డి లక్ష్మణ్‌నాయుడు, పి.నవీన్, వై.నారాయణరావు, నజీర్, లోక్‌నాథ్ తదితరులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా నియమించేందుకు ప్రకటన ఇచ్చి, గెస్ట్ ఫ్యాకల్టీగా కొనసాగిస్తున్నారన్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని చెప్పారు. కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నా తమకు రూ.25 వేలు చెల్లిస్తున్నారని చెప్పారు. జీవో -110ను అమలుచేసి నెలకు రూ.39,000 జీతం చెల్లించాలని కోరారు. ఆర్జీయూకేటీ పరిధిలో 44 మంది గెస్ట్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారని తెలిపారు.