Share News

భావనపాడు తీరాన్ని సందర్శించిన జేసీ

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:20 PM

భావనపాడు సముద్ర తీరాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు.

భావనపాడు తీరాన్ని సందర్శించిన జేసీ
తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెడుతున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

సంతబొమ్మాళి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): భావనపాడు సముద్ర తీరాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. తీరంలో అటవీశాఖ, ట్రీ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహి స్తున్న తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో పెంచుతున్న 420 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. కార్యక్రమంలో అటవీశాఖాధికారి నరేంద్ర, బీట్‌ ఆఫీసర్‌ జయలక్ష్మి, ట్రీ ఫౌండేషన్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ సోమేశ్వరరావు, సర్పంచ్‌ బుడ్డా మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:20 PM