ఆక్రమణలను పరిశీలించిన జేసీ
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:54 PM
సీతంపేట పంచా యతీ నక్కపేట గుంటుకువాని చెరువు, మర్రిబంద, శ్మశాన వాటిక, గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు గట్టుపై ఆక్రమ ణలను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ బుధవారం పరిశీలించారు.
జి.సిగడాం, జూలై 23(ఆంధ్రజ్యోతి): సీతంపేట పంచా యతీ నక్కపేట గుంటుకువాని చెరువు, మర్రిబంద, శ్మశాన వాటిక, గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు గట్టుపై ఆక్రమ ణలను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ బుధవారం పరిశీలించారు. ఈ ఆక్రమణలపై ఇటీవల గ్రామ రైతు ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఆయన పరిశీలించి ఆక్రమణ దారులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఈ చెరువు గట్టుపై నివసిస్తున్నా మని, వ్యవసాయ పనిముట్లు ఉంచడం, మూగ జీవాలకు ఆశ్రయం కోసం వాడుకుంటున్నామని, ఆక్రమణలకు పాల్పడ లేదని, న్యాయం చేయాలని వారు కోరారు. ఈ మేరకు ఆక్ర మణదారులు, గ్రామస్థుల నుంచి స్టేట్‌మెంట్‌ను నమోదుచేసి నివేదికను ఉన్నతాధికారులకు, ప్రభుత్వాని అందిస్తామన్నారు. చెరువులను పరిరక్షించే బాధ్యత మండల రెవెన్యూ అధి కారులు, వీఆర్వోలపై ఉందన్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉండడంపై పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ ఎం.సరిత, ఆర్‌ఐ ఆబోతుల రాధ ఉన్నారు.