Share News

సైనికుల కోసం ‘జనసేన’ ప్రత్యేక పూజలు

ABN , Publish Date - May 12 , 2025 | 12:07 AM

ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో భారత సైనికుల కోసం జనసేన ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్‌ ఆధ్వర్యంలో ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ అర్చకులు, వేదపండితులు సూర్య నమస్కారా లు, సౌరహోమం, నిర్వహించారు.

సైనికుల కోసం ‘జనసేన’ ప్రత్యేక పూజలు
అరసవల్లి: ఆదిత్యాలయంలో పూజలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులు

అరసవల్లి, మే 11(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో భారత సైనికుల కోసం జనసేన ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్‌ ఆధ్వర్యంలో ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ అర్చకులు, వేదపండితులు సూర్య నమస్కారా లు, సౌరహోమం, నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ.. మనకోసం దేశ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న సైనికులు క్షేమంగా ఉండాలని, విజయంతో, చిరునవ్వుతో వెనక్కు రావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పాలవలస యశస్వి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌, విజయనగరం జన సేన పార్టీ నాయకులు పత్తిగిల్లి వెంకటరావు, సంపత రావు, మండల లోకేష్‌, మారేష్‌, నారాయణరావు, నర్సిం గరావు, సాయి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

జవాన్ల త్యాగం మరవలేం..

ఇచ్ఛాపురం, మే 11(ఆంధ్రజ్యోతి): దేశం కోసం తల పెట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో వీరమరణం చెందిన జ వాన్ల త్యాగం మరవలేమని మాజీ సైనికోద్యోగుల సంఘ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం యూకాంప్లెక్స్‌లో గల సైనికోద్యోగుల కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులు మౌనం పాటి వీర జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బీఎల్‌ నారాయణ, మాజీ సైనిక ఉద్యోగులు విశ్వనాథం రెడ్డి, సీఎస్‌ రెడ్డి, పట్నాయక్‌, మదన్‌మోహన్‌, ఎం.సాహు, మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 12:07 AM