Share News

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌రెడ్డి

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:04 AM

రాష్ట్రంలో వెన్నుపోటు అనే పదానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిలుస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేక రులతో మాట్లాడారు.

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌రెడ్డి
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ

శ్రీకాకుళం, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వెన్నుపోటు అనే పదానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిలుస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేక రులతో మాట్లాడారు. జగన్‌రెడ్డి వేసే ప్రతి అడుగూ వె న్నుపోటు ఎలా ఉంటుందో చూపిస్తుంటుందని విమ ర్శించారు. సొంత తల్లికీ, చెల్లికీ వెన్నుపోటు పొడిచారని వాఖ్యానించారు. గత ఐదేళ్లలో జగన్‌ చేయలేని పనులు కూటమి ప్రభుత్వం ఏడాదిలో పూర్తి చేసిందని వివరించారు. గత ఐదేళ్ల పాలనలో ఏమీ చేయక రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని, అందుకే 11 సీట్లకే జగన్‌ను ప్రజలు పరిమితం చేశారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

వెన్నుపోటు.. గొడ్డలివేటుకు పేటెంట్‌

శ్రీకాకుళం, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ధర్నాల డ్రామాను జగన్‌ ఆడుతూ వెన్నుపోటుకు.. గొడ్డలి వేటుకు జగన్మోహనరెడ్డి పేటెంట్‌ పొందారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలి ఏడాదిలో పది శాతం హామీలను కూడా అమలు చేయని జగన్‌ ప్రభుత్వం అని.. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని వివరించారు. 70శాతం హామీలను మొదటి ఏడాదిలోనే అమలుచేశామని చెప్పారు.

ప్రజల దృష్టి మరల్చడానికే డ్రామాలు

కవిటి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ గత ఐదేళ్ల పాలనలో కుంభకోణాలు చేసి ఒక్కొక్కరు కటకటాలు పాలవుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్‌రెడ్డి డ్రామాలకు తెరతీశాడని ఇచ్ఛాపురం ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ విమర్శించారు. రా మయ్యపుట్టుగలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో బాబాయ్‌ని చంపిన వా రిని కాపాడుతూ రక్తసంబధీకులను వెన్నుపోటు పొడి చారన్నారు. ఆస్తికోసం కుటుంబ సభ్యులనే రోడ్డుకీడ్చిన ఘనుడు జగన్‌రెడ్డి అని దుయ్యబట్టారు. కూటమి ప్రభు త్వం ఏడాది పాలనలో 70శాతం హామీలను అమలు చేసిందన్నారు. జగన్‌ రెడ్డి పాలనలో 85శాతం హామీల ను ఎగనామంపెట్టారన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి విషపూరిత మద్యాన్ని అమ్మకాలు చేసి వేలకోట్లు దోచుకుని, పేదల ఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచార న్నారు. కూటమి పాలన వచ్చిన వెంటనే రహదారులు మెరుగుపర్చి, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశామ న్నారు. అన్ని వర్గాలను న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై విమర్శలు చేసి లబ్ధిపొందాల నుకుంటే ప్రజలు తగిన శాస్తి చేస్తారన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:05 AM